Son and Mother Died in Medak: చిన్నప్పటి నుంచి కల్ల ముందే పెరిగి పెద్దయిన కుమారుడు ఒక్కసారిగా గుండె పోటుతో చనిపోయాడనే వార్త విన్న ఆ తల్లి తట్టుకోలేకపోయింది. వెంటనే కుమారుడ్ని చూసేందుకు ఆస్పత్రికి వెళ్లి, తన కుమారుడి మృతదేహాన్ని చూసింది. ఆ బాధను జీర్ణించుకోలేక ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన వైద్యులు పరీక్షలు నిర్వహించారు. చివరికు ఆమె కూడా మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. తల్లీకుమారుడు ఇద్దరూ చనిపోవడంతో బాధిత కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో జరిగింది.
సడెన్‌గా గుండె ఎందుకు ఆగిపోతుంది? హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండల పరిధిలోని కూచన్‌పల్లి గ్రామానికి చెందిన వీరప్ప నర్సింహగౌడ్ (36) ఇంట్లో పడుకున్న సమయంలో తెల్లవారుజామున గుండె పోటు వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించాడు. కుమారుడు ఆస్పత్రిలో ఉన్నాడని తెలుసుకున్న తల్లి లక్ష్మి (53) హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లింది. అనంతరం కుమారుడి మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
హార్ట్ ఎటాక్ వస్తే సీపీఆర్ ఎలా చేయాలి? సింపుల్ స్టెప్స్ ఇవిగో!
Mother Died After Hearing Son Died in Medak: లక్ష్మికి వెంటనే వైద్యం అందించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గంట వ్యవధిలోనే తల్లీకుమారుడు చనిపోవడంతో బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆ గ్రామం అంతా విషాదఛాయలు అలుముకున్నాయి. నరసింహ గౌడ్‌కు ప్రసన్న, కార్తీక్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తానని జిల్లా జాగృతి అధ్యక్షులు రమేశ్ గౌడ్ హామీ ఇచ్చారు.
గంట వ్యవధిలోనే మరణించిన తల్లి కుమారుడు స్కూల్‌కు వెళ్తుండగా బాలికకు గుండెపోటు- పాఠశాల ఎదురుగానే మృతి
Person died Heart Attack at Railway Station: మరోవైపు ఓ ప్రయాణికుడు రైల్వే స్టేషన్లో ఫ్లాట్‌ఫారంపై గుండెపోటు(A Person Died Heart Attack in Railway Station)తో మరణించాడు. ఈ ఘటన మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో జరిగింది. మహబూబాబాద్‌లోని తెట్టెలపాడు గ్రామానికి చెందిన రాంబాబు (30) తన కుటుంబసభ్యులతో కలిసి మహబూబాబాద్ నుంచి హైదరాబాద్‌కు గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లేందుకు టికెట్ కొనుగోలు చేసి 2 నంబర్ ఫ్లాట్ ఫారంపై రైలు ఎక్కేందుకు నడుచుకుంటూ వస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ప్రయాణికులు వెంటనే సీపీఆర్ చేశారు. అయినా ఫలితం దక్కలేదు. మృతుడి భార్య నవ్య స్థానికుల సాయంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందాడని తెలిపారు. మృతుడికి ఇద్దరు కూమార్తెలు ఉన్నారు.
గుండెపోటు లక్షణాలు కనిపిస్తే.. వెంటనే ఇలా చేయండి!