తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపా చలో కలెక్టరేట్​లో స్వల్ప ఉద్రిక్తత - BJP medak collectorate program news

గొల్లకురుమల సమస్యలపై భాజపా ఆధ్వర్యంలో మెదక్‌ పట్టణంలో రణభేరి, ఛలో కలెక్టరేట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.

భాజపా చలో కలెక్టరేట్​
భాజపా చలో కలెక్టరేట్​

By

Published : Feb 26, 2021, 7:17 PM IST

మెదక్‌లో భాజపా ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో కలెక్టరేట్‌ కార్యక్రమంలో స్పల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. గొల్లకురుమల సమస్యలపై భాజపా ఆధ్వర్యంలో మెదక్‌ పట్టణంలో రణభేరి, ఛలో కలెక్టరేట్ నిర్వహించారు. స్థానిక జీకేఆర్ గార్డెన్స్‌లో తొలుత రణభేరి కార్యక్రమం జరిగింది. అనంతరం అక్కడ నుంచి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, భాజపా నేతలు కలెక్టరేట్‌కు బయలుదేరారు.

మెదక్​లో భాజపా చలో కలెక్టరేట్​

వారంతా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వద్దకు చేరుకోగానే పోలీసులు వారిని అడ్డుకున్నారు. అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కొంత తోపులాట జరిగింది. పోలీసులు నిలువరించాలని చూసినా భాజపా నేతలు, కార్యకర్తలు ముందుకు దూసుకెళ్లేందుకు యత్నించారు. పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకుగాను లక్ష్మణ్‌, రఘునందన్‌ రావు, పలువురు భాజపా నేతలను పోలీసులు అరెస్టు చేసి కొల్చారం పోలీసుస్టేషన్‌కు తరలించారు.

ఇదీ చూడండి:పోలీసుల తీరుపై డీజీపీకి కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు.!

ABOUT THE AUTHOR

...view details