మెదక్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయంలో చోరీకి గురైన వెండి తొడుగు లభ్యమైంది. గర్భగుడి గడపపై ఉన్న వెండి తొడుగు శనివారం చోరీకి గురైంది. ఆలయంలో లడ్డూ ప్రసాదం తయారు చేసే షెడ్డులో చీరలో వెండి తొడుగును చుట్టి దుండగులు వెళ్లిపోయారు.
వనదుర్గ ఆలయంలో చోరీకి గురైన వెండి తొడుగు లభ్యం - వెండి తొడుగు దొంగతనం వార్తలు
ఏడుపాయల వనదుర్గ ఆలయంలో చోరీకి గురైన వెండి తొడుగు లభ్యమైంది. ఆలయ సిబ్బంది జరిపిన విచారణలో దొంగతనం బయటపడింది. దానిని దొంగిలించడానికి యత్నించిన దుండగులు ఆలయంలోని షెడ్డులో చీరలో చుట్టి వెళ్లిపోయారు.
మంజీరా నదికి వరదలు వచ్చినప్పుడు ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో గర్భగుడి గడపకు ఉన్న వెండి తొడుగును తీసి అర్చకులు కార్యాలయంలో భద్రపరిచారని ఆలయ ఈవో సార శ్రీనివాస్ తెలిపారు. ఈ క్రమంలో దేవస్థానంలో పనిచేస్తున్న వీరేశం, లక్ష్మణ్‌లు గమనించి దొంగిలించే ప్రయత్నం చేశారని వివరించారు. పోలీస్ స్టేషన్‌లో వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:మా నినాదం విశ్వనగరం.. భాజపాది విద్వేష నగరం: కేటీఆర్