రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సంతకాల సేకరణ చేపట్టినట్లు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అనిల్‌కుమార్ తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షరాలు సోనియాగాంధీ పిలుపు మేరకు రెండు కోట్ల సంతకాల సేకరణలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని రైతులు, ప్రజల నుంచి సంతకాలను సేకరించారు.
రైతన్నగోస.. నర్సాపూర్‌లో సంతకాల సేకరణ - మెదక్ జిల్లా తాజా వార్తలు
రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుని మార్చుకోవాలని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అనిల్‌కుమార్ అన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నర్సాపూర్‌లో రైతన్నగోస కార్యక్రమాన్ని నిర్వహించారు.

రైతన్నగోస.. నర్సాపూర్‌లో సంతకాల సేకరణ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ విషయంలో రైతుల తరఫున తాము ఉద్యమం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ నగేష్ ముదిరాజ్, ఆవుల రాజిరెడ్డి, ఆంజనేయులు గౌడ్, సోమన్నగారి లక్ష్మీ, నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:బంగారు తెలంగాణ కేసీఆర్ కుటుంబానికే.. ప్రజలకు కాదు: మాణిక్కం