మెదక్ జిల్లాలో మంజీరా నదిపై నూతనంగా నిర్మించిన చెక్ డ్యాం వద్ద ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పూజలు నిర్వహించారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లా హావేలి ఘణపూర్ మండలం కుచన్ పల్లి గ్రామ సమీపంలోని మంజీర నదిపై నూతనంగా నిర్మించిన చెక్ డ్యాం పూర్తిగా నిండటంతో జలకళ సంతరించుకుంది.
కుచన్‌పల్లి చెక్‌డ్యాం సందర్శించిన శేరి సుభాష్ రెడ్డి -
మెదక్ జిల్లాలోని కుచన్‌పల్లి గ్రామంలో నిర్మించిన చెక్ డ్యాం వద్ద ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పూజలు నిర్వహించారు. ఈ జలాశయం ద్వారా చుట్టు గ్రామాల్లో ఉన్న భూగర్భ జలాలు నిండుకుని సంవత్సరానికి రెండు పంటలు పండించుకునే అవకాశం ఉందన్నారు.
కుచన్‌పల్లి చెక్‌డ్యాం సందర్శించిన శేరి సుభాష్ రెడ్డి
చెక్ డ్యాం ద్వారా ఐదు వేల ఎకరాల రైతులు లబ్ధి పొందనున్నట్లు ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి తెలిపారు. జలాశయం ద్వారా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఫరీద్పూర్, కుచన్‌పల్లి, గాంధారిపల్లి, ఎల్లాపూర్, ర్యాలమడుగు గ్రామాలు దీని ద్వారా ఎక్కువ లబ్ది పొందనున్నట్లు ఆయన తెలిపారు.
ఇవీ చూడండి: 'లోక్‌సభ సమావేశాల ఆల్‌టైమ్ రికార్డ్'