మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఇంటర్, డిగ్రీ కలశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం వెంటనే అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న వాటికి పక్కా భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.
'మధ్యాహ్న భోజనం' అమలు చేయాలి - Medak district
మెదక్ జిల్లాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలపై ఆర్టీవో కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

'మధ్యాహ్న భోజనం' అమలు చేయాలి