తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రామాల్లో స్వచ్ఛంధ దిగ్బంధం - self-isolation-of-villages-telangana

కరోనా మహమ్మారి నుంచి తమను మాత్రమే కాక తమ గ్రామాలను సైతం కాపాడుకోవాలన్న ఉద్దేశ్యంతో మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజక వర్గం పరిధిలోని పలు గ్రామాల ప్రజలు తమ గ్రామాలకు స్వచ్చంధంగా కంచె వేసుకున్నారు. గ్రామ సరిహద్దులు దాటి బయటకు వెళ్ల కుండా వారు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇతరులెవరూ తమ గ్రామాలలోకి రాకూడదంటూ ఆంక్షలు విధించుకున్నారు.

self-isolation-of-villages-telangana
గ్రామాల స్వచ్ఛంధ దిగ్బంధం

By

Published : Mar 24, 2020, 2:31 PM IST

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ నియోజక వర్గంలోని పలు గ్రామాల ప్రజలు ఇతరులు తమ ఊళ్లలోకి రాకుండా కంచెలు ఏర్పాటు చేసుకుంన్నారు. ముళ్లకంప, కర్రలు, దమ్ముచక్రాలు వంటి వాటితో కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల వారు తమతమ గ్రామాల్లోకి రాకుండా గ్రామాలను స్వీయ నిర్బంధంలో పెడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తు ఎవరి రక్షణలో వారు ఉంటున్నారు. గ్రామంలోని ప్రజలు కూడ బయటకు వెళ్లడంలేదు. గ్రామస్థులు ఇళ్లకే పరిమితమై కుటుంబసభ్యులతో గడుపుతున్నారు. ఇళ్ల వద్ద స్వంత పనులు చేసుకుంటున్నారు. కంచెలు తీయకుండ గ్రామాలకు చెందిన యువకులు పహారా కాస్తున్నారు.

గ్రామాల స్వచ్ఛంధ దిగ్బంధం

ABOUT THE AUTHOR

...view details