తెలంగాణ

telangana

ETV Bharat / state

మెదక్​లో ఘనంగా సీతారాముల కల్యాణం - తెలంగాణ వార్తలు

శ్రీరామనవమిని పురస్కరించుకొని మెదక్ పట్టణంలో సీతారాముల కల్యాణం ఘనంగా జరిపారు. శ్రీ కోదండ రామాలయంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ వేడుక నిర్వహించారు.

seetha rama kalyanam, medak seetha rama kalyanam
సీతారాముల కల్యాణం, శ్రీరామ నవమి 2021

By

Published : Apr 21, 2021, 4:26 PM IST

శ్రీరామ నవమిని పురస్కరించుకొని మెదక్​ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఉదయం పదిన్నర గంటల నుంచి 12 గంటల వరకు శాస్త్రోక్తంగా జరిపారు.

ఆలయ పూజారి భాష్యం మధుసూదనాచారి ఆధ్వర్యంలో వేద మంత్రాలు, మంగళ వాద్యాల నడుమ పెళ్లి తంతును సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సీతారాముల విగ్రహాలను పల్లకిలో తీసుకువచ్చి మండపంలో ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో జరిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ వేడుక నిర్వహించారు.

ఇదీ చదవండి:మనసెరిగినవాడు మన రాముడు!

ABOUT THE AUTHOR

...view details