అసలే కరోనా సమయం, వేసవికాలం... గ్రామాల్లో పనులు లేక ప్రజలు, యువకులు పాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పనులు కల్పించాలని కోరుతూ శీలంపల్లి గ్రామస్థులు.. మెదక్ జిల్లా చిలపచేడ్ మండలంలో ధర్నా చేశారు. నర్సాపూర్- జోగిపేట రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి.. రాకపోకలకు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
పనులు కల్పించాలని శీలంపల్లి గ్రామస్థుల రాస్తారోకో - telangana news
వేసవిలో పనులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు ఉపాధి కల్పించాలని కోరుతూ మెదక్ జిల్లా చిలపచేడ్ మండలంలో శీలంపల్లి గ్రామస్థులు ధర్నా చేపట్టారు.
![పనులు కల్పించాలని శీలంపల్లి గ్రామస్థుల రాస్తారోకో seelampally villagers strike](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11284606-752-11284606-1617609344541.jpg)
శీలంపల్లి గ్రామస్థుల రాస్తారోకో
విషయం తెలుసుకున్న ఎస్సై మల్లారెడ్డి అక్కడికి చేరుకుని గ్రామస్థులకు నచ్చజెప్పారు. తమకు పనులు కల్పించాలని కోరారు. రెండ్రోజుల్లో పనులు కల్పించే ఏర్పాట్లు చేస్తామని ఎస్సై హామీ ఇచ్చారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.