నేషనల్ సైన్స్ డే సందర్భంగా మెదక్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులు చేపట్టిన పదర్శన ఆకట్టుకుంది. విద్యార్థులు వివిధ రకాల వైజ్ఞానిక ప్రదర్శనలు చేశారు. నిత్యం ప్రజలు ఎదుర్కొనే సమస్యలను తమ ప్రయోగాల ద్వారా విద్యార్థులు చూపించారు. రంగోలితో శరీర భాగాలను వేశారు.
ఆకట్టుకున్న ప్రభుత్వ పాఠశాల వైజ్ఞానిక ప్రదర్శన - SCIENCE FAIR IN MEDAK GOVERNMENT GIRLS SCHOOL
మెదక్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. వివధ రకాల ప్రయోగాలు ప్రదర్శించి.. వివరించారు.
SCIENCE FAIR IN MEDAK GOVERNMENT GIRLS SCHOOL
ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో ఆలోచనా శక్తి పెరిగుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. నూతన ఆవిష్కరణలతో పిల్లల్లో ఉన్న సృజనాత్మకత వెలికి వస్తోందన్నారు. ప్రదర్శనలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ ప్రయోగాలను వివరిస్తూ... ఆకట్టుకున్నారు.