విద్యార్థుల కోలాహలంతో మెదక్ పట్టణంలోని పాఠశాలలు కళకళలాడుతున్నాయి. కరోనా వ్యాప్తితో పది నెలలుగా మూతపడ్డ పాఠశాలలు నేడు సందడిగా మారాయి. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతికి హాజరయ్యారు.
'మాస్కు ధరిస్తేనే.. తరగతిలోకి అనుమతి' - medak schools reopened 2021
కరోనా కల్లోలంతో మూతపడ్డ పాఠశాలలు పది నెలల తర్వాత నేడు తెరుచుకున్నాయి. విద్యార్థుల రాకతో మెదక్ పట్టణంలోని పాఠశాలలు సందడిగా మారాయి. తల్లిదండ్రుల అనుమతి పత్రం ఉన్న విద్యార్థులనే పాఠశాలలోనికి అనుమతిస్తున్నారు.
!['మాస్కు ధరిస్తేనే.. తరగతిలోకి అనుమతి' schools reopened in medak district after lock down](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10455799-247-10455799-1612159667189.jpg)
మెదక్లో పాఠశాలల పునఃప్రారంభం
తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రం తీసుకొచ్చిన విద్యార్థులను మాత్రమే పాఠశాల యాజమాన్యాలు తరగతికి అనుమతిస్తున్నాయి. ప్రతి విద్యార్థి మాస్కు ధరించేలా, చేతులు శానిటైజ్ చేసుకునేలా చూస్తున్నారు. కరోనా నిబంధనలు కొత్తగా ఉన్నా.. పది నెలల తర్వాత బడికి వచ్చామన్న ఆనందం విద్యార్థుల్లో కనిపిస్తోందని పాఠశాల యాజమాన్యాలు తెలిపాయి.
ఇదీ చూడండి :విద్యార్థుల సందడి.. మురిసిన బడి