తెలంగాణ

telangana

ETV Bharat / state

ట్రాక్టర్ డ్రైవర్ అవతారమెత్తిన మహిళా సర్పంచ్.! - తెలంగాణ వార్తలు

సర్పంచ్ అంటే కేవలం పర్యవేక్షణే కాదు పని చేసి చూపించాలంటూ నిరూపించారు బధ్యాతండా సర్పంచ్ బుజ్జిబాయి. కూలీలు రాకపోవడం వల్ల ఆమె స్వయంగా రంగంలోకి దిగి ట్రాక్టర్ నడపడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది.

sarpanch-drives-tractor-for-water-to-plants-at-bhadyathanda-in-medak-district
ఆ సర్పంచ్ ఎందరికో ఆదర్శం!

By

Published : Dec 30, 2020, 10:14 AM IST

ఇక్కడ ట్రాక్టర్ నడుపుతున్నది చోదకురాలు కాదు.. మెదక్ జిల్లా చీలప్​చెడు మండలం బధ్యాతండా సర్పంచ్ బుజ్జిబాయి. హరితహారం, పల్లెప్రగతిలో భాగంగా నాటిన మొక్కలకు నీరు పెట్టడానికి కూలీలు రాకపోవడం వల్ల ఆమె స్వయంగా రంగంలోకి దిగారు.

ఆ సర్పంచ్ ఎందరికో ఆదర్శం!

గత కొన్నిరోజులుగా కూలీలకు సరిపోను వేతనాలు సరిపోడం లేదని వారు రావడం మానేయగా.. తానే ట్రాక్టర్ నడుపుతూ నెలరోజులుగా మొక్కలకు రోజూ నీరు పెడుతోంది బుజ్జిబాయి. సర్పంచ్ చేసిన ఈ పని చాలామందికి ఆదర్శమని... శభాష్ సర్పంచ్ అంటూ స్థానికులు కొనియాడుతున్నారు.

ఇదీ చదవండి:తెర వెనుక చైనా.. కూపీ లాగుతున్నాం: అవినాష్ మహంతి

ABOUT THE AUTHOR

...view details