తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతుల అభివృద్ధికి నిత్యం కృషిచేస్తా...' - సంగారెడ్డిలో డీసీసీబీ ఎన్నికలు

మెదక్​ డీసీసీబీ అధ్యక్షునిగా చిట్టి దేవేందర్​రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇన్ని చేసిన సేవాకార్యక్రమల వల్లే.... రైతుల మళ్లీ ఎన్నుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.

SANGAREDDY DCCB ELECTION RESULTS
SANGAREDDY DCCB ELECTION RESULTS

By

Published : Mar 1, 2020, 4:21 PM IST

రైతుల అభివృద్ధికి అనునిత్యం కృషి చేస్తానని మెదక్ డీసీసీబీ అధ్యక్షునిగా ఎన్నికైన చిట్టి దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.1200 కోట్ల లావాదేవీలు ఉన్న బ్యాంకును వచ్చే ఐదేళ్లలో రెండింతలు చేస్తానని హామీ ఇచ్చారు. తనను ఎంపిక చేసినందుకు పార్టీ అధిష్ఠానానికి, ఎకగ్రీవంగా ఎన్నుకున్నందుకు డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. డీసీఎంఎస్ అధ్యక్షునిగా శివకుమార్​ను ఎన్నుకున్నారు. ఎన్నిక అనంతరం డైరెక్టర్లు, పార్టీ శ్రేణులు నూతన అధ్యక్షులను సన్మానించారు.

'రైతుల అభివృద్ధికి నిత్యం కృషిచేస్తా...'

ఇదీ చదవండి:ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details