అధికారులు ఉపాధి పనులకు సంబంధించిన రికార్డులన్ని భద్రపరుస్తూ.. ఉన్నతాధికారుల ఆకస్మిక తనిఖీలకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్ సైదులు పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో పర్యటించి నరేగా పనుల తీరును పరిశీలించారు. కలెక్టరేట్లో ఎంపీడీఓలు, ఎపీఓలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని.. అధికారులనుద్దేశించి మాట్లాడారు.
గ్రామ పంచాయతీల్లో తీర్మానం చేసిన పనులకు సంబంధించి.. రిజిస్టర్లు, వర్క్ఫైళ్ళు, సైట్బోర్డులు, ఫొటోలు, రికార్డులు, ఇతర ప్రతులన్ని భద్రపరచాలని సైదులు అధికారులకు సూచించారు. ఉన్నతాధికారుల ఆకస్మిక తనిఖీలకు సిద్ధంగా ఉండాలన్నారు.