తెలంగాణ

telangana

ETV Bharat / state

'మమ్మల్ని చంపేయండి.. మేం ఏం పాపం చేశాం' - మెదక్​లో ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం

మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యయత్నానికి ఒడిగట్టాడు. రెండు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు ఎదుర్కోలేక మెదక్ జిల్లా ఓ కండక్టర్ పురుగుల మందు తాగాడు.

Rtc worker
ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం

By

Published : Nov 27, 2019, 8:54 PM IST

రెండు నెలలుగా వేతనాలు రాక తీవ్ర మనస్తాపానికి గురై ఓ కండక్టర్​ పురుగుల మందు తాగిన ఘటన మెదక్​ జిల్లా జమ్మికుంటలో చోటుచేసుకుంది. జమ్మికుంటలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న మైసయ్య.. మెదక్ డిపోలో 15 సంవత్సరాలుగా కండక్టర్​గా విధులు నిర్వహిస్తున్నాడు. సమ్మె నేపథ్యంలో ఆర్థిక భారం ఎక్కువై.. ఇంటి అద్దె, కూతురు ఫీజు కట్టలేక, కుటుంబ పోషణ భారంగా మారింది. తీవ్ర మనోవేదనకు గురైన మైసయ్య ఇంట్లో పురుగుల మందు తాగాడు. భార్య లక్ష్మి, ఇరుగుపొరుగు వారు మైసయ్యను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడం వల్ల మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details