'మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగ లేఖలు రాయాలి' - rtc jac
ఆర్టీసీ జేఏసీ పిలుపుమేరకు మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి ఆర్టీసీ కార్మికులు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోగా తోపులాట జరిగింది.
ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు మెదక్లో కార్మికులు పాత బస్టాండ్ నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనలో కార్మికులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆర్టీసీ కార్మికుల సమస్యల గురించి బహిరంగ లేఖలు రాయాలని.. ఆర్టీసీ ఐకాస నేతలతో చర్చలు జరపాలని, లేనిపక్షంలో సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.