మెదక్ జిల్లా కేంద్రంలో ఈనాడు,ఈటీవి, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది ప్లాస్టిక్ నివారణపై ర్యాలీ తీశారు. మున్సిపల్ కార్యాలయం నుంచి క్రిస్టల్ గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్లాస్టిక్ నివారణపై మున్సిపల్ సిబ్బందికి నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పాల్గొన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై ప్రతిజ్ఞ చేయించారు.
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి: కలెక్టర్ - medak collector dharma reddy
వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. మెదక్ పట్టణంలో ఈటీవీ భారత్, ఈటీవీ, ఈనాడు ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణపై నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరయ్యారు.
ర్యాలీ