రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు.. వెలవెలబోతున్న సింగూర్ - ఉమ్మడి మెదక్ జిల్లా
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నా... ఉమ్మడి మెదక్ జిల్లాలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. వరుణుడి కరుణ లేక జలాశయాలు మైదానాలుగా మారుతున్నాయి. మంజీర నదిలో ప్రవాహాం లేక.. కీలక ప్రాజెక్టులు ఎండిపోయాయి.
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లోకి వరద వస్తోంది. కానీ ఉమ్మడి మెదక్ జిల్లాలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. వరుణుడి కరుణ లేక జలాశయాలు మైదానాలుగా మారుతున్నాయి. మంజీర నదిలో ప్రవాహాం లేక.. కీలక ప్రాజెక్టులు ఎండిపోయాయి. హైదరాబాద్కు తాగునీరు.. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలకు తాగు, సాగు నీరు అందించే సింగూర్ జలాశయం నీళ్లు లేక వెలవెలబోతోంది. మంజీరా నది తాజా పరిస్థితి.. ఉమ్మడి మెదక్ జిల్లాలో నెలకొన్న కరవు పరిస్థితులపై సింగూర్ ప్రాజెక్టు నుంచి మరింత సమాచారాన్ని ఈటీవీ భారత్ ప్రతినిధి క్రాంతికుమార్ అందిస్తారు.