మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో భారీ వర్షం కురిసింది. ఆర్టీసీ కుంట కాలువ వరద నీరు పెరగడం వల్ల పక్కన ఉన్న విఘ్నేశ్వర కాలనీలో వరద నీరు పోటెత్తింది. ఇళ్లలోకి కూడా నీరు చేరింది.
'వర్షం కురిసిన ప్రతిసారి వరద నీరు ఇళ్లలోకి చేరుతోంది' - మెదక్ జిల్లా వార్తలు
వర్షం పడ్డ ప్రతిసారి వరద నీరు వస్తోందని నర్సాపూర్‌లోని విఘ్నేశ్వర కాలనీ వాసులు ఆరోపించారు. కాలువ నిర్మాణం చేపట్టాలని కాలనీ వాసులు కోరారు. మురుగు, వరద నీరు రాకుండా శాశ్వత పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేశారు.
'వర్షం కురిసిన ప్రతిసారి వరద నీరు ఇళ్లలోకి చేరుతోంది'
వర్షం కురిసిన ప్రతిసారి వరద నీరు వస్తోందని కాలనీ వాసులు ఆరోపించారు. కాలువ నిర్మాణం చేపట్టాలని కాలనీ వాసులు కోరారు. మురుగు, వరద నీరు రాకుండా శాశ్వత పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేశారు. వర్షం పడితే విష పురుగులు ఇళ్లల్లోకి వస్తున్నాయని వాపోయారు. కర్రలు పట్టుకుని నిల్చోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి :వీసీల నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్