తెలంగాణ

telangana

ETV Bharat / state

'జనవరి 28న పుత్ర కామేష్టీ యాగం నిర్వహించనున్నాం' - medak district latest news

పుత్ర సంతాన ప్రాప్తి కోసం జనవరి 28న మెదక్​ జిల్లాలో... పుత్ర కామేష్టీ యాగం నిర్వహించనున్నట్లు సువిజ్ఞాన ఆశ్రమ నిర్వాహకులు సత్యవీర్ స్వామి తెలిపారు. యాగానికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు హాజరవుతారని అన్నారు.

Putra Kameshti Yagna on the 28th january in medak district
ఈ నెల 28న పుత్ర కామేష్టీ యాగం నిర్వహించనున్నాం

By

Published : Jan 24, 2021, 4:49 PM IST

పుష్యమాసం, పుష్యనక్షత్రం, గురుపౌర్ణమిని పురస్కరించుకుని పుత్ర సంతాన ప్రాప్తి కోసం... జనవరి 28న మెదక్ జిల్లా నర్సాపూర్​లో పుత్ర కామేష్టీ యాగం నిర్వహించనున్నట్లు... సువిజ్ఞాన ఆశ్రమ నిర్వాహకులు సత్యవీర్ స్వామి తెలిపారు. అదే రోజు ఉదయం 8గంటలకు సంతానం లేని దంపతులకు ఆయుర్వేదిక ఔషాధాన్ని అందిస్తామని పేర్కొన్నారు.

వంద రకాల వనమూలికలతో పుత్ర కామేష్టీ యాగాన్ని నిర్వహించనున్నట్లు... హైదరాబాద్ హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన తెలిపారు. ఆ తరువాత మహా మృత్యుంజయ యాాగం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ యాగానికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు హాజరవుతారని అన్నారు. యాగంలో పాల్గొనాలనుకునే వారు తమ పేర్లను ఆశ్రమ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని చెప్పారు.

ఇదీ చదవండి: వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details