మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలోని మూడో వార్డులో రెండు నెలలుగా తాగునీరు రావట్లేదని గ్రామస్థులు ఆందోళన చేశారు. రోడ్డుపైకి వచ్చి ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. పలుమార్లు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినప్పటికీ స్పందించడం లేదంటూ మహిళలు ఆగ్రహించారు.
ప్రగతి ధర్మారంలో ఖాళీ బిందెలతో నిరసన - రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం వార్తలు
రెండు నెలలుగా తాగునీరు లేదని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో జరిగింది. ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. అధికారుల నిర్లక్ష్యంతో అది క్షేత్ర స్థాయిలో అమలు కావట్లేదని మహిళలు వాపోయారు.
ప్రగతి ధర్మారంలో ఖాళీ బిందెలతో నిరసన
ఎంత బాధ ఉంటే రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తామని మహిళలు వాపోయారు. తక్షణమే అధికారులు స్పందించి నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని మహిళలు కోరారు.
ఇదీ చూడండి:సంస్కృతి, సంప్రదాయాలకు ఫునర్జీవం: మేయర్
TAGGED:
medak ramayampeta news