దేశానికే కీర్తి తెచ్చేలా జరుపుకునే గణేశ్ నవరాత్రి ఉత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదని, వాటిని వెంటనే ఎత్తివేయాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పబ్బ సత్యనారాయణ డిమాండ్ చేశారు. వేడుకలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ... విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులు మెదక్ పట్టణంలోని రామాలయం ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు.
'గణేశ్ నవరాత్రి ఉత్సవాలపై ఆంక్షలు ఎత్తివేయాలి'
వినాయక నవరాత్రి ఉత్సవాలను వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ... విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులు మెదక్ పట్టణంలోని రామాలయం ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు.
గణేశ్ నవరాత్రి ఉత్సవాలపై ఆంక్షలు ఎత్తివేయాలి
కరోనా నిబంధనలు పాటిస్తూ.. శాంతియుతంగా నవరాత్రులను జరుపుకుంటామని.. హిందువుల మనోభావాలు కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో అగ్నిపమాదం