తెలంగాణ

telangana

ETV Bharat / state

'అతని నుంచి నన్ను రక్షించండి' - lawyer ashwini kumar

తన ఆస్తిని అక్రమంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్న ఓ వడ్డీ వ్యాపారి పై చర్యలు తీసుకోవాలని ..తన ప్రాణానికి రక్షణ కల్పించాలని ఓ బాధిత న్యాయవాది ప్రభుత్వాన్ని వేడుకున్నాడు.

అతని నుంచి.. నన్ను రక్షించండి

By

Published : Aug 12, 2019, 10:56 PM IST

తన ఆస్తిని అక్రమంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్న ఓ వడ్డీ వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని... తనకు ప్రాణరక్షణ కల్పించాలని ఓ బాధిత న్యాయవాది ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో హైకోర్టు సీనియర్‌ న్యాయవాది గోపాల కృష్ణ కళానిధి సమక్షంలో మీడియా సమావేశం నిర్వహించారు. మెదక్‌ జిల్లాకు చెందిన అశ్విన్‌కుమార్‌ మాచారం గ్రామంలో ఓ ఫంక్షన్ హాల్‌ కొనుగోలు చేసేందుకు వడ్డీ వ్యాపారస్థుడు శ్రీధర్ వద్ద రూ.12లక్షలు అప్పుగా తీసుకున్నానని పేర్కొన్నారు. నెల వారీగా వడ్డీ చెల్లిస్తున్నా... సదరు వడ్డీ వ్యాపారి తన రాజకీయ పలుకుబడితో...ఆస్తి అంత తన పేరు మీద రాయాలని ఒత్తిడి చేస్తున్నాడని చెప్పారు. తన పై దాడి చేయడానికి కూడా పాల్పడ్డాడని తెలిపారు.

అతని నుంచి.. నన్ను రక్షించండి

ABOUT THE AUTHOR

...view details