‘మల్లేశం’ చిత్ర బృందం సిద్దిపేటలో గురువారం రాత్రి సందడి చేసింది. పట్టణంలోని ఓ థియేటర్‌లో ప్రేక్షకులను ఉత్సాహపర్చింది. సినిమా చూసేందుకు వచ్చిన వారిని పలకరించి.. ఆశ్చర్యానికి గురిచేసింది. అనంతరం నటీనటులు ప్రేక్షకుల మధ్య కేక్ కోసి తమ ఆనందం పంచుకున్నారు. అభిమానులతో స్వీయచిత్రాలు దిగారు. సినిమా ఎలా ఉందంటూ ఆరా తీశారు.
సిద్దిపేటలో 'మల్లేశం' ప్రియదర్శి... - MEDAK
ప్రియదర్శి కథానాయకుడిగా నటించిన మల్లేశం చిత్రం ఇటీవలే విడుదలై, విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నందున చిత్రబృందం సక్సెస్ టూర్‌లను నిర్వహిస్తోంది. అందులో భాగంగా సిద్దిపేట పట్టణంలోని పలు థియేటర్లను సందర్శించిన చిత్రబృందం, కేక్ కట్ చేసి ప్రేక్షకుల మధ్య సంబరాలు చేసుకున్నారు.
![సిద్దిపేటలో 'మల్లేశం' ప్రియదర్శి...](https://etvbharatimages.akamaized.net/assets/images/breaking-news-placeholder.png)
కథా నాయకుడు ప్రియదర్శి, కథానాయిక అనన్య, దర్శకుడు రాజ్.ఆర్. బృందం విలేకరులతో ముచ్చటించారు. భాష, ప్రాంతం భేదం లేకుండా ఆదరించడం ఆనందంగా ఉందన్నారు. చిత్రం చేనేత కార్మికులకు చేయూతగా నిలుస్తుందన్నారు. బృందంలో చింతకింది మల్లేశం ఉన్నారు. నూలుపోగు దండలతో పట్టణానికి చెందిన నటుడు రవితేజ చిత్రబృందాన్ని సత్కరించారు. నటులు గౌటి రాజు, కనకయ్య, వంశీ, యాదవ సంఘం ప్రతినిధి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:''మొండితనం వల్లే మూవీ ఆఫర్లు కోల్పోయా'
Last Updated : Jun 28, 2019, 11:14 AM IST