మెదక్ జిల్లా కేంద్రంలో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కల మందు కార్యక్రమాన్ని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఈ కార్యక్రమం చేపట్టారు. జిల్లాలో ఐదు సంవత్సరాల లోపు 75 వేల 590 మంది చిన్నారులను గుర్తించినట్లు వెంకటేశ్వర్లు తెలిపారు. 523 బూత్‌ల ద్వారా టీకా వేస్తున్నట్లు తెలిపారు. ప్రతి కేంద్రంలో నలుగురు చొప్పున 2250 మంది వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలను నియమించినట్లు వెల్లడించారు.
జిల్లాలో 523 బూత్‌ల ద్వారా పోలియో చుక్కల పంపిణీ - polio drops vaccination started in medak district centre
మెదక్ జిల్లాలో ఆదివారం పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు.. చిన్నారికి పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు.
చిన్నారులకు నిర్దేశించిన బూత్‌లలో మాత్రమే వ్యాక్సిన్ వేస్తారని అధికారి చెప్పారు. అనివార్య కారణాల వల్ల ఈ రోజు మిగిలిపోయిన చిన్నారులకు ఈ రెండ్రోజులు ఆరోగ్య కార్యకర్తలు.. ఇంటింటికి వెళ్లి పిల్లలను గుర్తించి పోలియో చుక్కలు వేస్తారని వివరించారు. ఇందుకు తల్లిదండ్రులు సహకరించవలసిందిగా వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, డాక్టర్ నవీన్ కుమార్, డాక్టర్ మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:త్వరలో అందుబాటులోకి రానున్న కరీంనగర్ పార్కు