తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎంత అవగాహన కల్పించిన ప్రజల్లో మార్పు రావట్లేదు' - నర్సాపూర్​లో పోలీసుల వాహన తనిఖీలు

కరోనా వైరస్‌ రోజురోజుకు మరింత పెరుగుతోంది. అయిన వాహనదారులు మాస్కులు లేకుండా నిర్లక్ష్యంగా నడుపడుతున్నారు. దానికి తోడు ఎలాంటి జాగ్రత్తలు లేకుండా ప్రయాణిస్తున్నారు. మహమ్మారి ఉద్ధృతి పెరుగుతున్న ప్రజల్లో మార్పు రావట్లేదని ఎస్సై సత్యనారాయణ తెలిపారు.

'ఎంత అవగాహన కల్పించిన ప్రజల్లో మార్పు రావట్లేదు'
'ఎంత అవగాహన కల్పించిన ప్రజల్లో మార్పు రావట్లేదు'

By

Published : Aug 27, 2020, 11:30 AM IST

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ పట్టణంలో వాహనదారులు ఇష్టారీతిన మాస్క్‌లు లేకుండా నడుపుతున్నారు. ఎస్సై సత్యనారాయణ మాస్క్‌లు ధరించిన వారి వాహనాలను నిలిపి జరిమానాలు విధించారు. అవగాహన కల్పిస్తున్న వాహనదారుల్లో మార్పులు రావడం లేదని ఎస్సై తెలిపారు. రోజు వాహన తనిఖీలు చేస్తే.. కొంచెమైన మార్పు వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.

మాస్క్‌, హెల్మెట్‌, సరైన ధ్రువపత్రాలు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని సత్యనారాయణ హెచ్చరించారు. వాహనాలు దొంగలిస్తే వెంటనే దొరుకుతారని తెలిపారు. పట్టణంలో అన్నిచోట్ల ట్రాఫిక్‌ నివారణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ధ్రువపత్రాలు లేని వాహనాలు స్వాధీనం చేసుకుంటామని ఎస్సై సత్యనారాయణ వెల్లడించారు.

ఇదీ చూడండి :వీసీల నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్‌

ABOUT THE AUTHOR

...view details