మెదక్ జిల్లా రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న నాగార్జున గౌడ్ వృత్తిపరంగా కఠినంగా ఉన్నా నిరుపేదలు, అన్నార్తులు, నిరాశ్రయులు, వలస కార్మికుల పాలిట అన్నదాతగా మారాడు. లాక్డౌన్ విధించిన కొత్తలో వృత్తిలో భాగంగా పెట్రోలింగ్‌కి వెళ్లిన నాగార్జున గౌడ్‌కు నెత్తిన మూటలతో చంకలో పసిబిడ్డలతో వెళ్తున్న కార్మికులను చూసి చలించిపోయారు. వారు 2 రోజులుగా అన్నం తినలేదని చెప్పడం వల్ల నాగార్జున గౌడ్ వెనువెంటనే వారందరికీ పాలు బ్రెడ్ తెప్పించారు. అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చారు. తన సర్కిల్ పరిధిలో ఎవరు ఆహారం లేకుండా పస్తులతో ఉండరాదని సంకల్ప్ ఫౌండేషన్‌ను స్థాపించాడు. 20 మంది సభ్యులతో సేవా కార్యక్రమాలు మొదలు పెట్టారు.
అన్నార్తుల ఆకలి తీరుస్తున్న పోలీస్.. - medak district news
వృత్తిలో కాఠిన్యత ఉన్నా.. తన లోపల సేవాభావం ఉందని నిరూపిస్తున్నాడో పోలీస్ ఆఫీసర్. సేవే లక్ష్యంగా వందలాది మంది అన్నార్తుల ఆకలి తీర్చి శభాష్ పోలీస్ అనిపించుకుంటున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో ఎవరూ పస్తులు ఉండొద్దనే దృఢ సంకల్పంతో 'సంకల్ప్ ఫౌండేషన్' స్థాపించి వందలాది మంది నిరుపేదల పాలిట అన్నదాతగా మారిన ఓ పోలీస్ ఆఫీసర్‌పై ప్రత్యేక కథనం.
సేవే లక్ష్యంగా అన్నార్తుల ఆకలి తీరుస్తున్న పోలీస్..
6మండలాల్లో 2వేల మంది నిరుపేదలకు వెయ్యి రూపాయల విలువ చేసే నిత్యావసర సరకులు అందించారు. జాతీయ రహదారిపై వెళ్తున్న వలస కార్మికులకు గత 50 రోజులుగా ఆహారం అందిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాల కోసం ఎందరో దాతలు తమ సహాయం అందించారు. ఈ పోలీసు అధికారి చేస్తున్న సేవలను తెలంగాణ డీజీపీ కూడా ట్విట్టర్లో అభినందించారు. శభాష్ పోలీస్ అని ప్రజలంతా చేతులెత్తి నమస్కరిస్తున్నారు.
ఇవీ చూడండి: 'నియంత్రిత సాగు విధానం కాదు.. నిర్బంధ సాగు విధానమే..'