అసలే లాక్డౌన్(Lock down) సమయం, పైగా ఎండాకాలం. ఈ పరిస్థితుల్లో రవాణా సౌకర్యం అందక ఇబ్బంది పడుతున్న ఓ నిండు గర్భిణీ పట్ల పోలీసులు మానవత్వం చూపించారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట పోలీసులు తమ వాహనంలో ఇంటికి(police help) సాగనంపారు.
శనివారం చేగుంట మండలం కర్నాల్పల్లికి చెందిన గ్యాదరి మనీశ తొమ్మిది నెలల గర్భిణీ కావడం వల్ల… తన అత్తగారితో కలిసి మెదక్ పట్టణానికి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం కోసం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో లాక్డౌన్ సడలింపు కారణంగా ఓ ఆటోవాలా.. మధ్యాహ్నం రెండు గంటలు కావడం వల్ల చిన్నశంకరంపేట పట్టణంలో వారిని వదిలి వెళ్లిపోయాడు.