మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్ పారిశ్రామిక వాడలో ఉన్న రేడియంట్ కేబుల్స్, పాలిమర్ పరిశ్రమ, ఏరినా ఏవన్ ఇంజినీరింగ్ పరిశ్రమలను ఆయా శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సందర్శించారు. పరిశ్రమలకు తోడ్పాటు ఇవ్వాలనే సంకల్పంతో వాటిల్లో ఉత్పత్తి ప్రారంభించేందుకు పరిశ్రమ వర్గాలకు అవసరమైన సహకారం ప్రభుత్వం ఇస్తుందన్నారు.
గ్రామీణ, పారిశ్రామికవాడల్లోని పరిశ్రమలకు అనుమతి - Relaxation from Lockdown to Rural and Industrial Area Industries
దాదాపు నలభై రోజుల లాక్‌డౌన్ తర్వాత గ్రామీణ, పారిశ్రామికవాడ ప్రాంతంలోని పరిశ్రమలను నిర్వహించుకోడానికి ప్రభుత్వం షరతులతో అనుమతించిందని మెదక్ జిల్లా పాలనాధికారి ధర్మారెడ్డి తెలిపారు.
Permission for industries in rural and industrial areas
పని ప్రదేశంలో కార్మికులు సామాజిక దూరం పాటించాలన్నారు, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించటంతోపాటు శానిటైజర్ వాడేలా చూడాలన్నారు. కార్మికులు పరిశ్రమ వాహనాల్లో పరిమితంగా రప్పించాలన్నారు. లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేసే వరకు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని సూచించారు.