రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా కేంద్రంలోని మసీదులు, ఈద్గాల్లో సందడి నెలకొంది. నవాబ్ పేటలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, జిల్లా సంయుక్త పాలనాధికారి నాగేష్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లింకు తెరాస ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామన్నారు.
పద్మా దేవేందర్‌రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు - padmadevender reddy
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గా వద్ద జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు.
చిన్నారితో పద్మాదేవేందర్ రెడ్డి