తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం అమ్మినా.. డబ్బుల కోసం తంటాలే.. - pacs

ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మెదక్​ జిల్లాలోని పోతంశెట్టిపల్లి గ్రామస్థులు కిష్టాపూర్​ కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించారు.   48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పి 20 రోజులు గడుస్తున్నా జమ చేయకపోవడం వల్ల రైతులు ఆవేదనకు గురవుతున్నారు.

ధాన్యం అమ్మినా.. డబ్బుల కోసం తంటాలే..

By

Published : May 18, 2019, 9:05 PM IST

మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామానికి చెందిన రైతులు కిష్టాపూర్​లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఏసీఎస్​ కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించారు. 48 గంటల్లో ఖాతాల్లో జమ చేస్తామని చెప్పిన అధికారులు 20 రోజులు గడిచినప్పటికీ డబ్బులు జమ చేయలేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రానున్న ఖరీఫ్ సీజన్​కు 15 రోజుల సమయమే ఉండటం వల్ల పెట్టుబడికి ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే ఖాతాలలో డబ్బులు జమ చేయాలని కోరారు.

ధాన్యం అమ్మినా.. డబ్బుల కోసం తంటాలే..

For All Latest Updates

TAGGED:

pacs

ABOUT THE AUTHOR

...view details