వ్యవసాయాన్ని బడా కంపెనీల నుంచి కాపాడాలని రైతు విద్రోహకర మోదీ వ్యవసాయ సంస్కరణలు తిప్పికొట్టాలని మెదక్ కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మామిళ్ల ఆంజనేయులు డిమాండ్ చేశారు. మెదక్ కలెక్టరేట్ ఎదుట కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లులు నిరసిస్తూ కాంగ్రెస్, సీపీఎం, కుల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ మేరకు అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది.
వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా మెదక్ కలెక్టరేట్ వద్ద ధర్నా - opposition party protest at medak collectorate
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును నిరసిస్తూ కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తలు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. సుమారు అరగంట సేపు రాస్తారోకో నిర్వహించగా భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.
![వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా మెదక్ కలెక్టరేట్ వద్ద ధర్నా opposition parties protest against agricultural bill at medak collectorate](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8933990-461-8933990-1601028040741.jpg)
వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా మెదక్ కలెక్టరేట్ వద్ద ధర్నా
అనేక విషయాల్లో ఎన్డీయేను బలపరుస్తూ వచ్చిన తెరాస, ఏఐడీఎంకే, బిజు జనతా దళ్ పార్టీలు.. వ్యవసాయ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం అన్నారు. మోదీ వ్యవసాయ బిల్లును వెంటనే రద్దు చేయాలని కోరుతూ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లకు వినతిపత్రం అందజేశారు.