సెల్ఫోన్లో పురోహితుడు వేదమంత్రాలు చదువగా... వధూవరులు ఒక్కటైన సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. పాపన్నపేట మండలం అంబ్రియా పంచాయతీ పరిధి సొమ్ల తండాకు చెందిన బానోత్ శివరాం కూతురు మంజులకు... టేక్మాల్ మండలం భీమ్లా తండాకు చెందిన పాత్లోథ్ మోహన్‌తో వివాహం నిశ్చయమైంది. పెళ్లి సోమవారం జరగాల్సి ఉండగా... అంతకు ముందు రోజున వధువు తండాలో ఓ యువకుడు కరోనాతో మృతి చెందాడు.
పంతులు రాలేదు కానీ... వేదమంత్రోశ్ఛరణల మధ్యే పెళ్లి జరిగింది - మొబైల్ పెళ్లి
వధూవరులు మండపంలో ఉన్నారు. పంతులు మాత్రం లేడు. మంత్రాలు మాత్రం వినబడుతూనే ఉన్నాయి. అందేటీ అని తీక్షణంగా చూస్తే... ఆ పంతులు ఆన్లైన్లో ఉన్నాడని అర్థమైంది. కరోనా భయంలో ఓ పంతులు మొబైల్ ద్వారానే పెళ్లి తతంగం కానిచ్చేశాడు. చరవాణీలో నుంచే కొత్తజంటకు ఆశీర్వాదాలిచ్చేశాడు.
online marriage in ambriya thanda
తండాకు వెళ్లి పెళ్లి చేసేందుకు భయపడిన పురోహితుడు... తన నివాసం నుంచే పెళ్లి జరిపించాడు. వీడియో కాల్లో పంతులు వేద మంత్రాలు చదువగా... మొబైల్‌ను మైకు వద్ద పెట్టి అందరికీ వినిపించేలా చేశారు. చరవాణీలో చూస్తూ... పురోహితుడు చెప్పిన విధంగా ఆ నూతన వధూవరులు చేశారు. మొత్తానికి మొబైల్ వీడియో కాల్‌తో... పెళ్లి తంతు ముగించారు. ఒక్కటైన కొత్త జంటను ఆన్లైన్లోనే ఆశీర్వాదించాడు ఆ పురోహితుడు. ఇప్పుడు ఈ పెళ్లి విషయం... జిల్లా అంతటా "ఆన్లైన్ పెళ్లి" పేరిట వైరల్ అవుతోంది.