తెలంగాణ

telangana

ETV Bharat / state

కొనసాగుతున్న కృష్ణా నంద స్వామి ఆరాధనోత్సవాలు - Krishna Nanda Swamy Worship Ceremonies at Rangammpet Madhavananda Ashram

రంగంపేట మాధవానంద ఆశ్రమంలో మూడు రోజుల నుంచి కృష్ణా నంద స్వామి ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. పీఠాధిపతి మాధవానంద స్వామి పర్యవేక్షణలో వేడుకలు ఘనంగా కొనసాగాయి.

Krishna Nanda Swamy Worship at Madhavananda Ashram
మాధవానంద ఆశ్రమంలో కృష్ణా నంద స్వామి ఆరాధనోత్సవాలు

By

Published : Jan 12, 2021, 8:44 PM IST

మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట మాధవానంద ఆశ్రమంలో కృష్ణా నంద స్వామి ఆరాధనోత్సవాలు మూడు రోజులుగా వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తీర్థ ప్రసాద వితరణ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

భక్తితో ముక్తి..

ఉత్సవాల్లో భాగంగా దర్బార్ కార్యక్రమం జరిగింది. అందులో సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. భక్తితోనే ముక్తి లభిస్తుందని మాధవానంద స్వామి తెలిపారు. ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని భక్తులకు సూచించారు.

ఇదీ చూడండి:వివేకానంద జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్

ABOUT THE AUTHOR

...view details