పదో తరగతి పూర్తైన బాలికను 40 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి... రెండో పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వచ్చిన అధికారులు పెళ్లిని అడ్డుకున్నారు. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కోక్యాతండాలో చోటుచేసుకుంది.
40 ఏళ్ల వ్యక్తితో బాలిక వివాహానికి ఏర్పాట్లు.. అడ్డుకున్న అధికారులు - తెలంగాణ వార్తలు
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కోక్యాతండాలో బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. పదో తరగతి పూర్తైన బాలికను 40 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేయగా... అధికారులు అక్కడికి వచ్చి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పెళ్లి ఆపేశారు.

http://10.10.50.85//telangana/13-February-2021/tg_srd_23_13_balya_vivaham_addaginta_ts10100_1302digital_1613227026_236.jpg
డిప్యూటీ తహసీల్దార్ తిరుమలరావు, సీడీపీవో హేమ భార్గవి, సూపర్వైజర్ అంజమ్మ, పోలీసులు అక్కడికి చేరుకొని బాలిక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. వివాహ వయస్సు వచ్చే వరకు పెళ్లి చేయొద్దని నచ్చజెప్పారు. అనంతరం బాలికను కస్తూర్బా కళాశాలలో చేర్పించారు. కట్నంగా ఇచ్చిన డబ్బులను తిరిగి ఇప్పించారు.