తెలంగాణ

telangana

ETV Bharat / state

18 నుంచి నామపత్రాల స్వీకరణ - mp elections

పార్లమెంటు ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు వేగవంతం చేసింది. మెదక్ పార్లమెంటు స్థానానికి ఈ నెల 18 నుంచి 25 వరకు అభ్యర్థుల నుంచి నామపత్రాలు స్వీకరిస్తామని  రిటర్నింగ్ అధికారి ధర్మారెడ్డి తెలిపారు.

18 నుంచి నామపత్రాల స్వీకరణ

By

Published : Mar 13, 2019, 5:34 PM IST

Updated : Mar 13, 2019, 5:45 PM IST

18 నుంచి నామపత్రాల స్వీకరణ
పార్లమెంట్​ ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటం వల్ల అధికారులు ఏర్పాట్లు చకచకా పూర్తిచేస్తున్నారు. ఈనెల 18 నుంచి మెదక్​ ఎంపీ స్థానానికి నామపత్రాలు స్వీకరిస్తామని రిటర్నింగ్​ అధికారి ధర్మారెడ్డి తెలిపారు. నామపత్రాలు సమర్పించటానికొచ్చే అభ్యర్థులు అనుసరించాల్సిన విధివిధానాలను వివరించారు.

అంతా రికార్డు అవుతుంది

నామినేషన్​ వేయడానికి ఎవరెవరు, ఎప్పుడెప్పుడొచ్చారు. ఏఏ పత్రాలు సమర్పించారు లాంటి అన్ని అంశాలు రికార్డు అవుతాయన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అయితే అభ్యర్థితో పాటు బలపరిచే వ్యక్తి ఒకరు రావాలి. ఇతర పార్టీల వారు, స్వతంత్ర అభ్యర్థులు అయితే బలపరిచే వ్యక్తులు పదిమంది ఉండాలి. వారంతా స్థానిక నియోజకవర్గానికి చెందినవారై ఉండాలన్నారు.

ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సిందే ​

ఎంపీ అభ్యర్థులు రూ. 70 లక్షల వరకు ఖర్చు చేయవచ్చని తెలిపారు. నామినేషన్​ సమయంలోనే అభ్యర్థుల తమ ఆస్తుల వివరాలు, ఐదేళ్లుగా వారి కుటుంబ సభ్యులు ఆదాయపన్ను​ వివరాలు జతచేయాలన్నారు. నేర చరిత్రకి సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఇవ్వాలని సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థుల ఖర్చులకు సంబంధించి మానిటరింగ్ టీం పనిచేస్తాయని ధర్మారెడ్డి తెలిపారు.

ఇవీ చదవండి:గులాబీ అధినేత అదృష్ట సంఖ్య తెలుసా..!

Last Updated : Mar 13, 2019, 5:45 PM IST

ABOUT THE AUTHOR

...view details