మెదక్ జిల్లా మంబోజిపల్లి మార్కెట్లో ప్రజలు భౌతిక దూరం అనే మాట మరుగునపడేశారు. కూరగాయలు కొనడానికి పెద్దఎత్తున కొనుగోలు దారులు రాగా... మాస్కులు ధరించకుండా, భౌతిక దూరాన్ని పక్కనపెట్టేశారు.
భౌతిక దూరం మాటే లేదు... మాస్కుల ఊసు అసలే లేదు! - people not using masks in medak
కరోనా వైరస్ నియంత్రణకు భౌతిక దూరమే దివ్య ఔషధమని పదే పదే చెబుతున్నా... ప్రజలు మాత్రం దాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. ఓ వైపు రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువవుతున్నా... ఇవేవి పట్టించుకోకుండా మార్కెట్లలో గుంపులుగుంపులుగా తిరుగుతున్నారు.
భౌతికదూరం మాటే లేదు... మాస్కుల ఊసు అసలే లేదు...!
జిల్లాలో ఇప్పటి వరకు చేగుంట, పాపన్నపేట మండలంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికైనా ప్రజలంతా అప్రమత్తంగా ఉండడం తప్పనిసరని... లేకుంటే లాక్డౌన్ కష్టాలు మళ్లీ పునరావృతమయ్యే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరాన్ని పాటించాలని మరీమరీ చెబుతున్నారు.