తెలంగాణ

telangana

ETV Bharat / state

గణేష్​ మండపాల ఏర్పాటుకు అనుమతి లేదు: మెదక్​ ఎస్పీ - corona virus

గణేష్​ నవరాత్రోత్సవాల సందర్భంగా మండపాల ఏర్పాటు కోసం ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదని మెదక్​ ఎస్పీ చందన దీప్తి తెలిపారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల నేపథ్యంలో వ్యాధి నియంత్రణ కోసం ఆర్బాటాలు లేకుండా నిరాడంబరంగా వేడుకలు జరుపుకోవాలన్నారు.

no permission to ganesh complexes in medak district
గణేష్​ మండపాల ఏర్పాటుకు అనుమతి లేదు: మెదక్​ ఎస్పీ

By

Published : Aug 18, 2020, 10:51 PM IST

కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో జిల్లాలో గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడం లేదని మెదక్​ జిల్లా ఎస్పీ చందన దీప్తి​ పేర్కొన్నారు. ప్రజలంతా సహకరించాలని ఎస్పీ కోరారు. ఎవరూ కూడా గణేష్​ నవరాత్రుల నిర్వహణ కోసం మండపాల ఏర్పాటు చేయరాదన్నారు. జిల్లా ప్రజలంతా పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని... చిన్న మట్టి విగ్రహాలను ఇండ్లలో ప్రతిష్టించుకొని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించుకోవాలని సూచించారు.
అత్యవసర సమయాలలో మాత్రమే బయటకు రావాలని ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరు మాస్క్​ ధరించి... భౌతిక దూరం పాటించాలని సూచించారు. బాధ్యతాయుతంగా ప్రజలంతా పోలీస్ శాఖతో సహకరించాలని ఎస్పీ కోరారు.

ABOUT THE AUTHOR

...view details