రైతులకు మేలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లు తీసుకొచ్చిందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. ఈ బిల్లుతో రైతులకు ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులో ఉంటే తాను రాజీనామా చేస్తానని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు సవాల్ విసిరారు.
మంత్రి హరీశ్‌రావుకు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ సవాల్
వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులో ఉంటే తాను రాజీనామా చేస్తానని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు సవాల్ విసిరారు. దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి రఘునందన్ రావు 30 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తాడని మెదక్‌లో అన్నారు.
మంత్రి హరీశ్ రావుకు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ సవాల్
బిల్లు డ్రాఫ్ట్ చదవకుండా, చర్చించకుండానే రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని అన్నారు. బిల్లులో రెన్యువల్ ఎనర్జీ పెంచుకోవాలని ఉందని చెప్పారు. అగ్రి బిల్లుల విషయంలో మీకు మీ మామకు ట్యూషన్ చెప్తా అని హరీశ్ రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పెన్షన్ల విషయంలో మంత్రి హరీశ్ రావు పూర్తిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 75% ఇస్తుందని సీఎం కూతురు కవిత తన ప్రసంగంలో చెప్పిందని ఆయన గుర్తు చేశారు.