మెదక్ జిల్లాలో మరో కొత్త మండలం.. ప్రాథమిక నోటిఫికేషన్ జారీ
16:50 July 01
మెదక్ జిల్లాలో మరో కొత్త మండలం.. ప్రాథమిక నోటిఫికేషన్ జారీ
మెదక్ జిల్లాలో మరో కొత్త మండలాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. తూప్రాన్ రెవెన్యూ డివిజన్‌లో కొత్త మండలంగా మాసాయిపేటను ఏర్పాటు చేస్తే నోటిఫికేషన్ జారీ చేసింది. చేగుంట మండలంలో మూడు, ఎల్దుర్తి మండలంలో ఆరు గ్రామాలతో మాసాయిపేట మండలం ఏర్పాటు కానుంది.
మాసాయిపేట మండల పరిథిలోకి చెట్లతిమ్మాయిపల్లి, పోతంపల్లి, పోతంషెట్‌పల్లి, రామంతపూర్, అచ్చంపేట, హకీంపేట, కొప్పులపల్లి, లింగారెడ్డిపల్లి గ్రామాలు రానున్నాయి. కొత్త మండలం ఏర్పాటుపై అభ్యంతరాలు, సూచనలు, సలహాల స్వీకరణకు ప్రభుత్వం నెల రోజులు గడువు ఇచ్చింది.
ఇవీ చూడండి:లాక్డౌన్ ఊహాగానాలు.. కిటకిలాడుతున్న రైలు, బస్ స్టేషన్లు