మెదక్ నవాబ్‌పేటకు చెందిన కావ్యకు డెంగీ వ్యాధి సోకి మృతి చెందింది. స్థానిక గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని విద్యార్థులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. మెదక్ రామాయంపేట ప్రధాన రహదారిపై విద్యార్థిని మృతదేహంతో నిరసన వ్యక్తం చేశారు.
గురుకుల సిబ్బంది నిర్లక్ష్యం.. విద్యార్థి మృతి - మెదక్ రామాయంపేట ప్రధాన రహదారిపై విద్యార్థిని మృతదేహంతో నిరసన వ్యక్తం చేశారు
గురుకుల విద్యార్థిని కావ్యకు డెంగీ వ్యాధి సోకినా ఉపాధ్యాయులు, సిబ్బంది నిర్లక్ష్యం చేయటం వల్లనే మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. పాఠశాల ముందు విద్యార్థులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన మెదక్‌లో చేటుచేసుకుంది.
గురుకుల సిబ్బంది నిర్లక్ష్యం.. విద్యార్థి మృతి
విద్యార్థులు ఆందోళన చేస్తూ పాఠశాలలోకి దూసుకెళ్లారు. పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. విద్యార్థిని తల్లిదండ్రుల్లో ఒకరికి ఔట్ సోర్సింగ్‌లో ఉద్యోగం ఇచ్చి ఆదుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ నగేష్ హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి : రైతులకు ఇబ్బంది లేకుండా పత్తి కొనుగోళ్లు: ఎర్రబెల్లి