మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల పుణ్యక్షేత్రంలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. వనదుర్గామాత ఆలయం నుంచి పరవళ్లు తొక్కుతున్న మంజీరా నదిపాయ వద్ద గంగమ్మకు పూజలు నిర్వహించారు. అనంతరం రాజగోపురంలో వనదుర్గామాత ఉత్సవ విగ్రహానికి పూజలు చేశారు. అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారు ముక్కుపుడక సమర్పించి మొక్కులు చెల్లించారు.
ఏడుపాయల వనదుర్గమ్మకు మంత్రి హరీశ్ మొక్కులు - yedupayala vana durga bhavani temple in medak
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల పుణ్యక్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వనదుర్గాభవానీ అమ్మవారు శ్రీశైలపుత్రిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఏడుపాయలను సందర్శించిన రాష్ట్రమంత్రి హరీశ్ రావు.. అమ్మవారికి మొక్కులు చెల్లించారు. గతేడాది దుర్గమ్మకు మొక్కుకున్నానని.. అందుకే ఇప్పుడు దర్శించుకుని అమ్మ ఆశీర్వాదం తీసుకున్నానని తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులంతా అమ్మవారిని దర్శించుకోవాలని సూచించారు.
ఏడుపాయల పుణ్యక్షేత్రంలో నవరాత్రులు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని మంత్రి హరీశ్ తెలిపారు. శ్రీశైలపుత్రిగా కొలువైన అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. గతేడాది దుర్గమ్మను దర్శించుకుని మొక్కానని.. ఇప్పుడు ఆ మొక్కులు చెల్లించి.. చల్లంగ చూడమని తల్లిని కోరానని చెప్పారు.
కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలని సూచించారు. వారికి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారని వెల్లడించారు. మంజీరా నదిలో వరద ఉద్ధృతి తగ్గిన తర్వాత మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు చేస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
- ఇదీ చదవండి :కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తుల 'అయ్యప్ప దర్శనం'