'జీవనవిధానంలో మార్పుతో ఆరోగ్యకరమైన జీవితం' - కలెక్టర్ ధర్మారెడ్డి
జీవనవిధానంలో మార్పుతో ఆరోగ్యకరమైన జీవితం సాధ్యమవుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. ప్రపంచ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో ఆయుర్వేదిక్ శిబిరాన్ని ప్రారంభించారు.
ప్రపంచ ఆయుర్వేద దినోత్సవం
ఆయుర్వేద మందులతో అన్నిరకాల రోగాలు నయమవుతాయని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. ప్రపంచ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నుంచి తెలంగాణ భవన్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయుర్వేదిక్ శిబిరాన్ని ప్రారంభించారు. ఆరోగ్యమైన జీవితం కోసం జీవన విధానంలో మార్పు రావాలని, రోగాలు వచ్చిన తర్వాత ఇబ్బంది పడడం కన్నా ముందుగానే ఆరోగ్య నియమాలు పాటించి జాగ్రత్తగా ఉండటం మేలని తెలిపారు.
- ఇదీ చూడండి : "కేసీఆర్ వ్యాఖ్యలు బాధాకరం.. అంతిమ విజయం మాదే.."