తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్​ - మెదక్​లో అక్రమ మద్యం పట్టివేత

అక్రమంగా మద్యం తెచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను నర్సాపూర్​ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి పది మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

illegally selling alcohol seized
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్​

By

Published : Apr 22, 2020, 7:02 AM IST

లాక్​డౌన్​ సమయంలో అక్రమంగా మద్యం తెచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరిని మెదక్​ జిల్లా నర్సాపూర్​ పోలీసులు అరెస్టు చేశారు. మందుబాబుల బలహీనతను ఆసరాగా చేసుకుని మద్యం విక్రయిస్తున్న వారిపై నిఘా పెట్టిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పట్టణానికి చెందిన రఫీ, కుమార్ అక్రమంగా మద్యం తెచ్చి.. ఒక్కో బాటిల్​పై రెండొందల వరకు ధరను పెంచి అమ్ముతున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి 10 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని రిమాండ్​కు తరలించారు. లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయాలు చేపడితే కఠన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి:'ఎవరూ ఈ విద్యా సంవత్సరం ఫీజులు పెంచొద్దు'

ABOUT THE AUTHOR

...view details