తెలంగాణ

telangana

ETV Bharat / state

Narsapur Municipal Commissioner suspended: కుక్కలను చంపినందుకు మున్సిపల్ కమిషనర్​పై వేటు

Narsapur Municipal Commissioner
Narsapur Municipal Commissioner

By

Published : Oct 28, 2021, 7:02 PM IST

Updated : Oct 28, 2021, 7:29 PM IST

19:00 October 28

వీధికుక్కలను చంపినందుకు మున్సిపల్ కమిషనర్‌ సస్పెండ్​

మెదక్​ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. వీధికుక్కలను సామూహికంగా చంపినందుకు ఆయనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ అశ్రిత్‌ను పురపాలకశాఖ డైరెక్టర్‌  సస్పెండ్ చేశారు.  

 ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా మెదక్ జిల్లా స్థానికసంస్థల అదనపు కలెక్టర్​ను నియమించారు. నివేదికను 15 రోజుల్లోగా ఇవ్వాలని సీడీఎంఏ సత్యనారాయణ ఆదేశించారు.  

ఇదీ జరిగింది...

వీధి కుక్కల(Street Dogs were Killed)కు పురపాలక సిబ్బంది విషమిచ్చి చంపారనే ఫిర్యాదుతో వాటి కళేబరాలను వెలికితీసిన ఉదంతం మెదక్ జిల్లా నర్సాపూర్​లో చోటుచేసుకుంది. దసరా నాడు పట్టణంలో ఆరుగురిపై ఓ పిచ్చికుక్క దాడిచేసి గాయపర్చింది. అనంతరం స్థానికుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు పురపాలిక పాలకవర్గ సమావేశం నిర్వహించి సిబ్బందితో వీధికుక్కలను పట్టించారు. వాటిలో 200లకు పైగా కుక్కలకు విషమిచ్చి చంపారని(Street Dogs were Killed), పురపాలక సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీపుల్ ఫర్ యానిమల్ ఆర్గనైజేషన్ సహాయ మేనేజర్లు గౌతమ్, శివనారాయణ, జంతు ప్రేమికుడు పృథ్వీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు

శునకాల కళేబరాలను మెదక్ మార్గంలోని లక్ష్మీనారాయణస్వామి ఆలయ భూముల్లో పాతిపెట్టారన్న సమాచారంతో పోలీసుల సమక్షంలో బుధవారం జేసీబీతో తవ్వకాలు చేపట్టారు. కొన్ని కళేబరాలు బయటపడగా వాటికి పశుసంవర్ధకశాఖ ఏడీ డాక్టర్ జనార్దన్ రావు పోస్టుమార్టం నిర్వహించారు.

పిచ్చికుక్క కరిచినందునే...

ఈ విషయమై నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ అశ్రిత్​ కుమార్​ను కోరగా.. దసరా నాడు పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న కొందరిని పిచ్చికుక్క కరిచిందన్నారు. కొన్ని వీధి కుక్కలనూ కరిచిందని తెలిపారు. ఆగ్రహించిన స్థానికులు పిచ్చికుక్కతో పాటు దాని బారినపడ్డ వాటిని చంపేశారని(Street Dogs were Killed) వివరించారు. పురపాలికకు సమాచారం ఇవ్వడంతో కుక్కల కళేబరాలను సిబ్బంది పాతిపెట్టారని, వాటికి విషమిచ్చి చంపారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.  

ఇదీ చూడండి:Street Dogs were Killed : వీధికుక్కలకు విషమిచ్చి చంపారు..!

Last Updated : Oct 28, 2021, 7:29 PM IST

ABOUT THE AUTHOR

...view details