రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అందరూ చల్లని మనసుతో దీవించాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కోరారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 190 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను నర్సాపూర్ ఎమ్మెల్యే పంపిణీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఆడపిల్ల తల్లిదండ్రులకు ఆర్థిక భారం ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి రూ. లక్షా నూట పదహారు ఆర్థిక సహాయం అందజేయడం చాలా సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు.
సీఎం కేసీర్‌ను చల్లని మనసుతో దీవించండి: ఎమ్మెల్యే - నర్సాపూర్ తాజా వార్తలు
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 190 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పంపిణీ చేశారు. ఆడపిల్ల తల్లిదండ్రులకు ఆర్థిక భారం ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి రూ. లక్షా నూట పదహారు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేయడం చాలా సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు.
సీఎం కేసీర్‌ను చల్లని మనసుతో దీవించండి: ఎమ్మెల్యే
ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతోందని ఎమ్మెల్యే తెలిపారు. రాబోయే రోజుల్లో చెక్కులు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. మరిన్ని పథకాలు ప్రజలకు అందజేయడానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. . ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:సీఎం సహాయనిధి: ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం