Narsapur Forest Urban Park :ఉమ్మడి మెదక్ జిల్లాలోని అటవీ శాఖ ఆధ్వర్యంలో అడవిని పార్కుగా మలిచి, నిర్వహిస్తున్న ఏకైక పార్కు నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్కు. మెుత్తం ఈ పార్కును 650 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానంగా కొండ గొర్రెలు, తాబేళ్లు, జింకలు, అడవి పందులు, నెమళ్లు సంచరిస్తుంటాయి. పార్కులో బందీలుగా కాకుండా స్వేచ్ఛగా అడవిలో తిరుగుతున్న జంతువులను చూడటంతో పర్యాటకులు మంత్రముగ్దులవుతున్నారు.
అలసిపోయినప్పుడు సేదతీరటానికి అక్కడక్కడ చెక్కల రూపంలో దిమ్మెలను ఏర్పాటు చేశారు. అటవిలో సందర్శన ప్రాంతాల వివరాల మెుత్తం మ్యాప్ రూపంలో పార్కు ప్రారంభంలో ప్రదర్శించారు. దీంతో పర్యాటకులు ఎక్కడికి వెళ్లాలో ఇక్కడే నిర్దేశించుకుంటున్నారు. పర్యాటకులు సెల్ఫీలు దిగడానికి అడవి దున్న ప్రతిమను తయారు చేసి ప్రదర్శనగా ఉంచారు.
Siricilla Kotha Cheruvu: సిరిసిల్లలో కొత్త చెరువుకు పర్యాటక శోభ
ఈ అటవీని మొత్తం చూసేందుకు వీలుగా మధ్యలో వాచ్ టవర్‌ను ఏర్పాటు చేశారు. ఆ టవర్‌లో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చుట్టూ సహజ సిద్దమైన అందాలను చూడొచ్చు. దీనిపై నుంచి పక్కనే ఉన్న చెరువును చూస్తుంటే తమని తాము మైమరిచిపోయేలా ఉందని తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరానికి అతి సమీపంలో ఉండటంతో ఉద్యోగులు తమ ఒత్తిడిని కొంత మేరకు తగ్గించుకోవడానకి ఈ పార్కు ఎంతగానో ఉపయోగపడుతోందని అభిప్రాయపడుతున్నారు.
"సీటీ దూరంగా ఇలాంటి ప్రదేశం ఉండటం చాలా బాగుంది. మంచిగా వీకెండ్స్‌లో ఫ్యామిలీతో వచ్చి సమయాన్ని గడపవచ్చు. వ్యూ పాయింట్, ట్రక్కింగ్ అన్ని చాలా బాగున్నాయి. పొల్యూషన్ లేకుండా ఇక్కడ ప్రశాంతంగా ఉంది. లోపలికి ప్లాస్టిక్ వస్తువులను తీసుకెళ్లనివ్వడం లేదు". - పర్యాటకులు
Narsapur Forest Tourist place :ఈ అడవిలోనే పర్యాటకుల కోసం ప్రత్యేకించి 800 మీటర్ల ట్రక్కింగ్ పాత్ని ఏర్పాటు చేశారు. మరో మార్గంలో 9 కీలో మీటర్ల మేరా సైక్లింగ్ చేయడానికి మార్గాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఔషదాల కోసం 10 రకాల మెుక్కలను పెంచుతున్నారు. వానరాల ఆహారం కోసం పంట తోటలను సైతం పెంచుతున్నారు. వర్షం కురిసిన సమయంలో నీరు వృధాగా పోకుండా వాటిని వడిసి పట్టడానికి చెక్ డ్యామ్‌లను ఏర్పాటు చేశారు. వాటి నుంచి పార్కులో అక్కడక్కడ ఏర్పాటు చేసిన కుంతల్లోకి పంపి నీటిని నిల్వ చేస్తున్నారు. దీని ద్వారా వేసవిలో కూడా నీటిని జంతువులకు అందించే అవకాశం ఉంటుంది.