ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా హవేలి ఘన్పూర్ మండలంలో చివరి రోజు నామినేషన్ల పర్వం అట్టహాసంగా కొనసాగింది. మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలు, ఒక జడ్పీటీసీ స్థానం ఉంది. ఈరోజు మధ్యాహ్నం వరకు తెరాస నుంచి ఏడుగురు, భాజపా నుంచి ఒక్కరు, కాంగ్రెస్ నుంచి నలుగురు ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. హవేలీ ఘన్పూర్ మండలం జడ్పీటీసీ స్థానానికి తెరాస తరఫున సుజాత నామపత్రం సమర్పించారు. పాపన్నపేట మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలు, ఒక జడ్పీటీసీ స్థానం ఉంది. ఈరోజు మధ్యాహ్నం వరకు 19 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి.
చివరి రోజు భారీగా దాఖలైన నామినేషన్లు - zptc
మెదక్ నియోజకవర్గంలో చివరిరోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం ఆరు మండలాలు ఉండగా తొలి విడతతో రెండు మండలాలకు ఎన్నికలు జరుగుతున్నాయి
చివరి రోజు భారీగా దాఖలైన నామినేషన్లు