తెలంగాణ

telangana

ETV Bharat / state

మెదక్​లో ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్ - municipal election polling started in medak

మెదక్​ పురపాలికలో పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. అభ్యర్థులు ఓటర్లను ఆటోలు, కార్లు, ద్విచక్రవాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తీసుకువస్తున్నారు.

municipal-election-polling-started-in-medak
మెదక్​లో ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్

By

Published : Jan 22, 2020, 9:10 AM IST

మెదక్​ పురపాలికలోని 30 వార్డులకు పోలింగ్​ ప్రశాంతంగా ప్రారంభమైంది. మహిళలు, యువకులు ఉత్సాహంగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పలు వార్డుల్లోని అభ్యర్థలు ఓటర్లను.. ఆటోలు, కార్లు, ద్విచక్రవాహనాల్లో కేంద్రాలకు తరలిస్తున్నారు.

పలు పోలింగ్​ కేంద్రాల వద్ద నడిచే ఓపిక లేకున్నా కుటుంబ సభ్యలు సాయంతో వృద్ధులు, వికలాంగులు కేంద్రాలకు తరలివచ్చి ఓటేస్తున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మెదక్​లో ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్

ఇదీ చదవండి:'తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది'

ABOUT THE AUTHOR

...view details