మెదక్ జిల్లా కేంద్రంలోని 12, 13 వ వార్డుల్లో కుక్కలు, కోతుల బెడద రోజు రోజుకీ పెరుగుతోందని వీటిపై సత్వరమే చర్యలు తీసుకోవాలంటూ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ నెల 8వ తేదీన చిన్న పిల్లాడిపై పిచ్చికుక్క దాడి చేయగా.. బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. మరో ఇద్దరి బాలురపై కూడా పిచ్చికుక్కలు దాడి చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్పందించిన మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ... వారం రోజుల్లోగా పిచ్చి కుక్కల ఏరివేత కార్యక్రమం చేపడతామని తెలిపారు.
'పిచ్చికుక్కలు, పందులు, కోతుల బెడద ఎక్కువైంది' - PIGS
మెదక్ జిల్లా కేంద్రంలో కోతులు, పందులు, పిచ్చి కుక్కుల బెడద రోజురోజుకీ ఎక్కువవుతోందని, వీటిపై త్వరగా చర్యలు తీసుకోవాలంటూ మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
'పిచ్చికుక్కలు, పందులు, కోతుల బెడద ఎక్కువైంది'